BHPL: జిల్లా వ్యాప్తంగా గత రెండు నెలలుగా కురిసిన భారీ వర్షాలు, గోదావరి బ్యాక్వాటర్ల కారణంగా జిల్లాలో 852 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని DAO బాబురావు గురువారం తెలిపారు. మహదేవపూర్ మండలంలో 745.83 ఎకరాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లగా, కాటారం, పలిమెల, ఘనపూర్ మండలాల్లోనూ నష్టం జరిగింది. నష్ట వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.