ASF: కాగజ్ నగర్ పట్టణం 3వ వార్డు BJP సీనియర్ నాయకులు ముదిగొండ సాంబయ్య, చంద్రకళ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మంగళవారం BJPలో చేరారు. వారికి MLA హరీష్ బాబు కాషాయ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాగజ్ నగర్ మున్సిపల్ కౌన్సిల్‌పై కాషాయ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.