మెదక్: ఆసుపత్రులలో శానిటేషన్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివని, వారిని కార్మికులుగా చూడకుండా ఉత్తమ సేవకులుగా భావిస్తూ గౌరవించాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శివదయాళ్ అన్నారు. మెదక్ మాతా, శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే 40 మంది శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందిని శాలువాలతో సత్కరించారు.