MDK: పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని 23వ వార్డులో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ కమిషనర్, మండల నేతలు, తదితరులు పాల్గొన్నారు.