VKB: పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పరిగి మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య అన్నారు. పరిగిలోని కొడంగల్ చౌరస్తా సమీప ప్రాంతంలో ఆదివారం పారిశుద్ధ్య పనులను పరిశీలించి మాట్లాడారు. పరిగి పట్టణ పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.