SRD: వర్షానికి దెబ్బతిన్న ఇండ్లకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఖేడ్ నియోజకవర్గం BRSV నియోజకవర్గ అధ్యక్షులు అంజా గౌడ్, మాజీ ZPTC రవీందర్ డిమాండ్ చేశారు. ఖేడ్ మండలం నాగపూర్లో ఈదురు గాలుల బీభత్సం వర్షానికి మారుతి, సైదులు, రాములు అనే వ్యక్తుల ఇంటిపై కప్పు ధ్వంసమై నష్టపోయారని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం BRS నాయకులు బాధితుల ఇళ్లను పరిశీలించారు.