NZB: చందూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బి.ఆర్ . అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.