MDK: జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాల్లో అకౌంటెంట్, ఏఎన్ఎం ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాధాకిషన్ తెలిపారు. మూడు అకౌంటెంట్, నాలుగు ఏఎన్ఎం పోస్టులు ఖాళీ ఉన్నాయని, వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం చేయనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు సమగ్ర శిక్షా జిల్లా కార్యాలయం లేదా 8985889663, 7893308762 నంబర్లను సంప్రదించాలన్నారు.