BDK: దసరా పండుగ సందర్భంగా కార్మికులకు దుస్తులు ఇవ్వడం సంతోషకరమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. బుధవారం టేకులపల్లి మండలం చుక్కలబోడుకు చెందిన టిప్పర్, లారీ వెల్ఫెర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద కార్మికులకు ఖాకీ దుస్తులు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్మికులు సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.