RR: లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ DRM గోపాలకృష్ణన్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సంబంధించి రద్దీకి తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. భారీగా ప్రయాణికులు లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్దకు వచ్చే అవకాశం ఉన్నందున, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు.