KMM: కూసుమంచి మండలంలో BR అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా నాయకుడు గుండా ఉపేందర్‌రెడ్డి ఇవాళ డిమాండ్ చేశారు. రోడ్ విస్తరణలో భాగంగా ప్రధాన కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన అధికారులు, ఆ తరువాత విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తిరిగి విగ్రహం నిర్మించాలని ఖమ్మం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.