SRCL: విద్యా సంస్థల సమయానికి ఆర్టీసీ అధికారులు బస్సులను నడిపించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని నాయకులు, విద్యార్థులతో కలిసి బుధవారం వీర్నపల్లి మండలా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. స్థానిక ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.దీాంతో సుమారు రెండు గంటల పాటు రాకపోకలు స్తంభించిపోయాయి. ఆర్టీసీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.