WGL: రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీల తుది ఓటరు జాబితాలను వార్డుల వారీగా, పోలింగ్ స్టేషన్ల వారీగా సిద్ధం చేయాలని ఇవాళ ఆదేశించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 75 మండలాల్లో 1708 పంచాయతీలు, 15,006 వార్డులు, 15,021 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఎంపీడీవోలు ఈనెల 28న డ్రాఫ్ట్ జాబితా, సెప్టెంబర్ 2న తుది జాబితాను పబ్లిష్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.