»A Huge Fire Broke Out In Swapnalok Complex Secunderabad
fire accident : సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్‌లోని (Secunderabad) స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో (Swapnalok Complex),గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం (fire accident) చెలరేగింది. భవనంలోని మూడో ఫ్లోర్లో కొందరు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. కాంప్లెక్స్‌లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
సికింద్రాబాద్‌లోని (Secunderabad) స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో (Swapnalok Complex),గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం (fire accident) చెలరేగింది. భవనంలోని మూడో ఫ్లోర్లో కొందరు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. కాంప్లెక్స్‌లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 7,8 అంతస్తుల్లో మంటలు ఎగిసిపడుతుండగా సమాచారం అందుతుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదన్నికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది,(Fire fighters ) పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ప్రమాద సమయంలో ఆఫీసుల్లోనే కొందరు ఉద్యోగులు ఉన్నారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో పలు బట్టల షాప్‌లు, (Clothing shops) గోడౌన్లు ఉన్నాయి.. వారిలో ఉన్న వారు తమను కాపాడాలంటూ అర్తనాదాలు పెడుతున్నారు. మొత్తం 8 మంది చిక్కుకున్నట్లు పేర్కొంటున్నారు. అయితే, దట్టమైన పొగతో రెస్క్యూ ఆపరేషన్‌కి(Rescue operation) ఆటంకం ఏర్పడుతోంది. 6వ ఫ్లోర్లో చిక్కుకున్న వాళ్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాంప్లెక్స్‌లో ఎక్కువ క్లాత్షాప్లు కావడంతో మంటలు ఎగిసిపడుతున్నాలీ. 1980ల్లో నిర్మించిన స్వప్నలోక్ కాంప్లెక్స్ లో చాలా షాపులు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.