GDWL: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గద్వాల పట్టణంలోని నదీ అగ్రహారం వద్ద కృష్ణానదీ పుష్కరఘాట్ దగ్గర భక్తుల రద్దీ అధికంగా ఉంది. భక్తులు నదీలో పుణ్య స్నానాలు అనుసరించి కార్తీకదీపాలు వెలిగించి నదిలోకి వదులారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో నది స్నానం అత్యంత ఉత్తమం అని పురాణం చెబుతోంది.