GNTR: అఖిలాంధ్ర సాధు పరిషత్ ఆధ్వర్యంలో తెనాలిలో సెప్టెంబర్ 7న ప్రారంభమైన అర్ధ చాతుర్మాస వ్రత మహోత్సవాలు ఇవాళ కార్తీక పౌర్ణమితో ఘనంగా ముగిశాయి. ఈ వ్రతాల సమయంలో ప్రతిరోజూ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. సాధు పరిషత్ అధ్యక్షులు పరమాత్మానంద గిరి స్వామి సహా ఇతర స్వామీజీలు పాల్గొని, వ్రత విశిష్టత మరియు ఉపదేశాలను భక్తులకు తెలియజేశారు.