సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అర్బన్ ఆక్సిజన్ పార్క్లో మొక్కలు మంత్రి పొన్నం ప్రభాకర్ నాటారు. అనంతరం మొక్కలు నాటి సంరక్షించాలని ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచమే కుగ్రామంగా మారుతున్న వేళ పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.మొక్కలు నాటడం మన జీవితంలో భాగస్వామ్యం కావాలన్నారు.