SRD: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పోతిరెడ్డి పల్లిలోని స్ట్రెక్టా పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమావేశానికి రాష్ట్ర నాయకులు హాజరవుతారని చెప్పారు. జిల్లా కార్యవర్గ సభ్యులు సమావేశానికి సకాలంలో హాజరుకావాలని కోరారు.