HYD: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ ముకుందరెడ్డిని కలిసి జర్నలిస్టుల పెండింగ్ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. బడ్జెట్లో రూ.100 కోట్ల కేటాయింపు, ఎంపానెల్మెంట్, కొత్త అక్రెడిటేషన్ కార్డుల జారీ, ఇళ్ల స్థలాలు, పెన్షన్, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డులు అందించాలని కోరారు.