JN: రఘనాథపల్లి మండలం శ్రీమన్నారాయణపురం గ్రామంలోని రైతులకు జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో గిడ్డంగుల్లో నిలువ చేసిన వ్యవసాయ ఉత్పత్తులపై, రుణాల పథకాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ పి.జ్యోతి మాట్లాడుతూ.. మార్కెట్లో ధర లేనపుడు గిడ్డంగుల్లో నిల్వ చేసుకొని 7 నుంచి 8 శాతం వడ్డీతో ఋణం పొందవచ్చు అన్నారు.