WGL: పర్వతగిరి మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన చిర్రబోయిన అరుణ (45) వడదెబ్బకు గురై మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తీవ్ర ఎండల కారణంగా గురువారం పనిలో ఉండగానే అస్వస్థతకు లోనైన ఆమెను కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.