JN: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ప్రచారం చేశారు. సరోజిని నగర్లో బట్టలు ఐరన్ చేస్తూ.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం పిలుపునిచ్చారు. ప్రజల్లో కలసిమెలసి ప్రచారం చేసిన ఆమె, “నవీన్ యాదవ్ గెలుపు అంటే జూబ్లీహిల్స్ గెలుపు” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.