SRD: గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన సర్పంచ్ ఇప్ప పెంటారెడ్డిని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి లభించిన విశేష ప్రజాదరణతో గ్రామం కాంగ్రెస్ కంచుకోటగా మారిందని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు.