PDL: ఓదెలలోని గుంపుల రైతు వేదికలో ఇందుర్తి, గుంపుల, గూడెం గ్రామాల రైతులకు ఫార్మర్ ఐడీ కార్డు కోసం ఏవో కిరణ్ రిజిస్ట్రేషన్ నిర్వహించారు. ప్రతి రైతు డిజిటల్ గుర్తింపు కార్డు కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ గుర్తింపు కార్డుతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ నిధి, ఫసల్ బీమా, సాయిల్ హెల్త్ కార్డు వంటి సదుపాయాలు పొందవచ్చని సూచించారు.