SRD: జాతర మహోత్సవానికి పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ని ఆలయ నిర్వహకులు ఆహ్వానించారు. పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో ఈ నెల 23 నుండి 24 వరకు నిర్వహించనున్న శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మహోత్సవానికి హాజరుకావాలని గ్రామస్తులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, స్థానికులు ఉన్నారు.