RR: ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ పట్టణంలో అధ్యక్షులు హరి భూషణ్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.