NZB: శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ లోకి ఎగువ ప్రాంతాల నుంచి మళ్లీ వరద పెరగడంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొత్తం 40 గేట్లు ఓపెన్ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 1,66,455 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో 40 వరద గేట్ల ద్వారా 1.50 లక్షల క్యూసెక్కులు గోదావరిలోకి విడిచిపెడుతున్నారు.