KMR: జిల్లాలో కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం దేవునిపల్లి PSలో కానిస్టేబుల్‌గా ఉన్న రవికుమార్ గతంలో పెద్దకొడఫ్గల్ PSలో విధులు నిర్వహించాడు. ఆ సమయంలో బస్ వారెంట్లపై ASI, విధులకు గైర్హాజరైన SI సంతకాలు ఫోర్జరీ చేసి తప్పుడు నివేదికలు సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు SP రాజేశ్ చంద్ర అతడిని సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.