మెదక్: ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ పెంపు, రూ. 53 వేల ఉద్యోగాలు భర్తీ, ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ పథకం అమలు చేసిందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సోమవారం సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.