BHPL: టేకుమట్ల(M) గిద్దెముత్తారం గ్రామానికి చెందిన అజ్మీర రాజేందర్ నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన విషయం తెలిసిందే. శనివారం అతడి మృతదేహం మానేరు వాగులో తేలింది. స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, వైద్య బృందం ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి, ప్రభుత్వ వైద్యులు ప్రాథమిక పరిశీలన చేసి పోస్టుమార్టం నిర్వహించారు.