KNR: రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని రైతు వేదికలో మంగళవారం మండలం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పంటలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. బలమైన నేలలు, మెరుగైన పంటలపై రైతులకు మెలకువలను తెలియజేశారు. అలాగే అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోకుండా ఉండడానికి పలు రకాల సూచనలు అందజేశారు.