MDK: జిల్లాలో భూభారతి దరఖాస్తుల రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు నవంబర్ 1 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి.. స్పెషల్ డ్రైవ్లో సుమారు 1000 దరఖాస్తులను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రతి తహసీల్దార్ ప్రతిరోజు 10 దరఖాస్తులను క్లియర్ చేయాలని ఆయన ఆదేశించారు