మంచిర్యాల: బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రిలో RO ప్లాంట్ ఆలనాపాలన కరువైంది. ప్లాంట్ చెడిపోయి నెల రోజులు కావస్తున్నప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు. చల్లటి శుద్ధి జలాన్ని అందించే ఆర్వో ప్లాంట్ సేవలకు ఉద్యోగులు, వైద్య సిబ్బంది రోగులు దూరమయ్యారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి RO ప్లాంట్ బాగు చేయించాలని కోరుతున్నారు.