NLG: చందంపేట మండలం తెల్దేవర్ పల్లి గ్రామంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మహా జాతర ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ వారు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. నల్గొండ జిల్లాతో పాటు, ఇతర జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారని పేర్కొన్నారు.