వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గం 36వ డివిజన్ చింతల్ హిందూ స్మశాన వాటికను పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దహన సంస్కారాలు నిర్వహించడానికి సరియైన సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. దహన సంస్కారాల ఏర్పాటు కొరకు స్నానాలు చేయడానికి నీటి సదుపాయం, నల్లాలు, స్నానపు గదులు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే దీనిపై చొరవ చూపాలని కోరుతున్నారు.