NZB: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు సర్వీస్ రూల్స్, చట్టాలు, కండక్ట్ నిబంధనలపై శిక్షణ నిర్వహించారు. ఉద్యోగ సేవల్లో ఎదురయ్యే సమస్యలను చట్టబద్ధంగా ఎలా పరిష్కరించుకోవాలో అవగాహన కల్పించారు. రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ యోహన్ శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో ఏవో సుమంత్ కుమార్, డాక్టర్లు రవీందర్, సికందర్ నాయక్ ఉన్నారు.