KNR: చొప్పదండి పట్టణం సహా నియోజకవర్గంలోని వివిధ రకాల అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని MLA మేడిపల్లి సత్యం సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ MLA సత్యం మంగళవారం సమావేశం నిర్వహించారు. అమృత్ పథకం ద్వారా నియోజకవర్గంలో నిర్మించనున్న వాటర్ ట్యాంకుల కోసం స్థలం కేటాయించాలన్నారు.