NZB: ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామానికి చెందిన కావేరిని సోమవారం అర్ధరాత్రి ప్రసవ నిమిత్తం నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా, జానకంపేట వద్ద నొప్పులు అధికమవడంతో, 108 సిబ్బంది అంబులెన్స్ నిలిపి, చాకచక్యంగా సుఖ ప్రసవం చేశారు. దీంతో ఆమె పండంటి మగ బిడ్డకు జన్మించింది. సుఖ ప్రసవం చేసిన 108 సిబ్బంది కి కుటుంబ సభ్యులు అభినందించారు.