HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో తమ పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారం చేయకపోవడంపై బీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ బైపోల్లో కాంగ్రెస్లో విజయమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేసి ఉంటే.. ప్రజలు ప్రభావితమయ్యేవారని బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు.