BDK: యూరియా కోసం రోడ్డు ఎక్కుతున్న వారు రైతులు కాదని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని బీజేపీ నాయకులు గొడుగు శ్రీధర్ యాదవ్ గురువారం అన్నారు. రైతులను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులకు సరైన సమయంలో యూరియా అందించలేని రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రంపై నిందలు వేస్తుందని మండిపడ్డారు.