NGKL: జిల్లాలోని కృష్ణానదిలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నెలరోజుల్లో కనిష్ఠానికి నీటిమట్టం చేరుకుంది. జనవరి నెలాఖరులో ఉండే లెవల్‌కు డిసెంబర్లోనే శ్రీశైలం వాటర్ తగ్గిపోయింది. రాయలసీమలోని సాగు, తాగునీటి ప్రాజెక్టులకు నీటిని తరలిస్తుండటంతో కృష్ణానదిలో నీటిమట్టం రోజురోజుకు తగ్గుతున్నాయి.