NLG: జిల్లా బీజేపీ పట్టణ అధ్యక్షుడు గడ్డం మహేష్ తండ్రి శంకరయ్య మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలను దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. నిన్న ఆయన మరణించాక, అంగీకారంతో నేత్రాలను సేకరించారు. దుఃఖంలోనూ అంధులకు చూపునిచ్చేలా వారు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో స్ఫూర్తిదాయకమని లయన్స్ క్లబ్ ప్రతినిధులు కొనియాడారు.