BDK: మణుగూరు గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ కార్యకర్త దామల పద్మ ఆదివారం రాత్రి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పుల్లారెడ్డి, జిల్లా సమితి సభ్యులు జంగం మోహన్ రావు సోమవారం పద్మ భౌతిక కాయానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.