KMM: జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మంగళ, బుధవారాల్లో పర్యటించనున్నట్లు మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఖమ్మంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు బోనకల్లు, చింతకాని మండల కమిటీ బాధితులతో సమావేశమవుతారు. సాయంత్రం 4:15కు మధిర, ఎర్రుపాలెం మండలాల్లో వివిధ కార్యక్రమాలకు హాజరవుతారు.