NGKL: ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ రఘు తెలిపారు. ఎలాంటి కడుపుకోత లేకుండా 2 నుంచి 5 నిమిషాల్లో ఆపరేషన్ చేసి ఉచితంగా మందులు ఇచ్చి వెంటనే ఇంటికి పంపుతామన్నారు. ఉదయం 11గంటలకు నిర్వహించే ఉచిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరాన్ని జిల్లాలోని పురుషులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.