RR: జాగృతి అధ్యక్షురాలు కవిత మహేశ్వరం నియోజకవర్గంలో చేపట్టిన ‘జనం బాట’ కార్యక్రమానికి స్థానిక నాయకులు కర్నాటి చంద్రకాంత్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కవితను భారీ గజమాలతో సన్మానించారు. అనంతరం కవిత శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలకు శాంతి, అభివృద్ధి కలగాలని భగవంతుడిని వేడుకున్నారు.