HYD నుంచి ORR చేరుకోవాలంటే సిటీ ట్రాఫిక్ కష్టాల్లో గంటల సమయం వెచ్చించాల్సిన పరిస్థితి. ఇక త్వరలో ఈ తిప్పలు తీరనుంది. HYD పారడైజ్ జంక్షన్ నుంచి ORR శామీర్ పేట జంక్షన్ వరకు 18 KM కారిడార్ నిర్మాణం జరగనుంది. ఇందులో 11.5KM ఎలివేటెడ్, 6KM ఎట్ గ్రేడ్, 0.5KM అండర్ గ్రౌండ్ కారిడార్ నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఇక ORR వెళ్లేందుకు రాజమార్గం కానుందన్నారు.