RR: చౌదరిగూడ మండలం తుమ్మలపల్లిలో నిర్వహించిన క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీ సోమవారం ముగిసింది. విజేతలకు BRS నేతలు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను క్రీడల్లో ప్రోత్సహించేందుకే పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆర్థిక సహాయంతో మొదటి విజేతకు నగదు, ట్రోఫీ బహుమతి అందజేసినట్లు తెలిపారు.