PDPL: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. సోమవారం ఆయన పెద్దపల్లి పట్టణంలో 18,19, 20, 22, 24, 25, 30, 34, 35 వార్డులలో ఇందిర ఇళ్లకు భూమి పూజ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు.