PDPL: 58వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖో-ఖో ఛాంపియన్ షిప్ పోస్టర్ను పెద్దపల్లి జిల్లా డీసీపీ పుల్ల కరుణాకర్ ఆవిష్కరించారు. నవంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న ఈ రాష్ట్రస్థాయి పోటీలకు తెలంగాణ వ్యాప్తంగా 11 పురుషుల, 10 మహిళా జట్లు పాల్గొంటాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖో-ఖో సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు డా. వేల్పుల కుమార్ పాల్గొన్నారు.